కమాన్‌చౌరస్తా / చిగురుమామిడి / కమాన్‌పూర్, ఏప్రిల్ 24: కరోనా నుంచి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్‌కుమార్ త్వరగా కోలుకోవాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు టీఆర్ఎస్ నాయకులు శనివారం ఆలయాల్లో పూజలు చేశారు. కరీంనగర్ కోతిరాంపూర్‌లోని గిద్దె పెరుమాండ్ల స్వామి ఆలయంలో టీఆర్ఎస్ నాయకుడు కలర్ సత్తన్న పొర్లుదండాలు పెట్టారు. 101 కొబ్బరి కాయలు కొట్టి, భక్తులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. చిగురుమామిడి మండలం ఇందుర్తి ఆంజనేయస్వామి ఆలయంలో టీఆర్ఎస్ నాయకులు పూజలు జరిపారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లోని ఆదివరాహస్వామికి పలువురు పూజలు చేశారు.