Munugode by poll Results | మునుగోడు తీర్పుతో బీజేపీ మైండ్ బ్లాంక్ : దాసోజు శ్రవణ్
Munugode by poll Results | మునుగోడు ఉప ఎన్నికల్లో ఆ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పుతో బీజేపీ నాయకుల మైండ్ బ్లాంక్ అయిపోయిందని టీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితంపై దాసోజు శ్రవణ్ తెలంగాణ
Munugode by poll Results | మునుగోడు ఉప ఎన్నికల్లో ఆ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పుతో బీజేపీ నాయకుల మైండ్ బ్లాంక్ అయిపోయిందని టీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితంపై దాసోజు శ్రవణ్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. మునుగోడులో బీజేపీ బొక్కా బొర్లా పడ్డదన్నారు. మునుగోడు ప్రజలు కేసీఆర్ను గుండెల్లో పెట్టుకున్నారు. బీజేపీ తెలంగాణకు పనికిరాదు అని ప్రజలు తేల్చేశారు. అయినప్పటికీ చిల్లర ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు.
18 వేల కోట్ల కాంట్రాక్టుల కమీషన్లు తీసుకున్న వారికి మునుగోడు ప్రజలు చరమగీతం పాడారు. కేసీఆర్పై విశ్వాసంతో, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షమే, అభివృద్ధి పథకాలకు ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ అడ్డదిడ్డంగా పని చేస్తుందని బీజేపీ నాయకులు మాట్లాడటం సరికాదు. బీజేపీ నేతలు నీచంగా మాట్లాడుతున్నారు. ఓటమిని తట్టుకోలేక బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. నైతికంగా నేను గెలిచానని రాజగోపాల్ రెడ్డి చెప్పడమంటే ఓడిపోయానని ఒప్పుకోవడమే అని పేర్కొన్నారు. మునుగోడును హస్తగతం చేసుకోవాలన్న కుట్ర పూరిత ప్రయత్నాన్ని మునుగోడు ప్రజలు తిప్పికొట్టారని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

