హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): తుంగభద్ర నదీ యాజమాన్య బోర్డు (టీఆర్ఎంబీ) సమావేశం ఈ నెల 22న నిర్వహించనున్నారు. ఈ మేరకు బోర్డు కార్యదర్శి తెలంగాణ, ఏపీ, కర్ణాటక నీటిపారుదల శాఖలకు సమాచారమిచ్చారు. నదిలోని నీటి లభ్య త, మూడు రాష్ర్టాల మధ్య పంపకం పై సమావేశంలో చర్చించనున్నారు.