ములుగురూరల్, జూన్ 29 : ములుగు జిల్లా తొలి జడ్పీచైర్మన్, బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు కుసుమ జగదీశ్వర్ ప్రథమ వర్ధంతిని శనివారం నిర్వహించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, శంకర్‌నాయక్, తాటికొండ రాజయ్య తదితరులు జగదీశ్వర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మంత్రి సీతక్క సైతం మల్లంపల్లికి చేరుకొని జగదీశ్వర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.