మణికొండ, జులై 30: శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత, దివంగత డాక్టర్ బీఎస్ రావుకు పలువురు ప్రముఖులు ఘన నివాళి అర్పించారు. నార్సింగిలోని ఓం కన్వెన్షన్ హాల్లో ఆదివారం బీఎస్‌రావు సంతాప సభను కుటుంబ సభ్యులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు కే తారక రామారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, చామకూర మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నవీన్‌రావు, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, ఈటల రాజేందర్ తదితరులు హాజరై, నివాళి అర్పించారు. విద్యారంగానికి బీఎస్ రావు చేసిన సేవలను స్మరించుకొన్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యావేత్తలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ చైతన్య కళాశాలల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొని నివాళి అర్పించారు.