బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 00:59:07

సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం

సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం

హైదరాబాద్‌/నిర్మల్‌, నమస్తే తెలంగాణ: జీవో నంబర్‌ 3పై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంపై సర్వత్రా హర్షంవ్యక్తమవుతున్నది. బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. ఉట్నూర్‌ ఎంపీడీవో కార్యాలయంలోఆదివాసీ నాయకులు, సర్పంచులు.. నార్నూర్‌ మండల కేంద్రంలో తుడుందెబ్బ నాయకులు  సంబురాలు జరిపారు. కుమ్రంభీంఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ వ్యవసాయ మార్కెట్‌లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కనక యాదవ్‌రావ్‌ ఆధ్వర్యంలో సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.  

సీఎం కేసీఆర్‌కు మంత్రి సత్యవతి కృతజ్ఞతలు

జీవో నంబర్‌ 3పై రివ్యూ పిటిషన్‌ వేస్తామన్న సీఎం కేసీఆర్‌ నిర్ణయం హర్షణీయమని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు.  బుధవారం సత్యవతి రాథోడ్‌ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.


logo