కామారెడ్డి జిల్లాలో అటవీశాఖ అధికారులపై గిరిజనుల దాడి
Kamareddy | లింగంపేట్ మండలం ముంబోజిపేట్ తండాలో అటవీశాఖ అధికారులపై గిరిజనులు దాడికి పాల్పడ్డారు. ట్రాక్టర్లతో పొలం చదును పనులు గిరిజనులు చేపట్టగా.. రైతులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. అటవీ

కామారెడ్డి : లింగంపేట్ మండలం ముంబోజిపేట్ తండాలో అటవీశాఖ అధికారులపై గిరిజనులు దాడికి పాల్పడ్డారు. ట్రాక్టర్లతో పొలం చదును పనులు గిరిజనులు చేపట్టగా.. రైతులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. అటవీ భూములను అక్రమంగా దున్నుతున్నారని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో అధికారులపై గిరిజనులు కర్రలతో దాడులకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని ఫారెస్ట్ అధికారులను గిరిజనుల దాడుల నుంచి కాపాడారు. గాయపడ్డ అధికారులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

