నారాయణఖేడ్, అక్టోబర్ 11: గంజాయి క్షేత్రాలపై దాడులకు వెళ్లిన ఎక్సైజ్ జిల్లా టా స్క్‌ఫోర్స్ అధికారులపై తండావాసులు ఎదు రుదాడికి దిగిన ఘటన సంగారెడ్డి జిల్లాలో సంచలనం రేకెత్తించింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చల్లగిద్ద తండాలో పత్తిలో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నట్టు సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు జరిపారు. ఈ క్రమం లో తండాకు చెందిన జానకీరాం చేనులో 64 గంజాయి మొక్కలను గుర్తించడంతో పాటు మోహన్, దశరథ్ వద్ద నాలుగు కిలోల ఎండు గంజాయి, 1.5 కిలోల గంజాయి విత్తనాలు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను విచారిస్తున్న సందర్భంలో తండావాసులంతా మూకుమ్మడిగా టాస్క్‌ఫోర్స్ అధికారులను దుర్భాషలాడుతూ దాడికి తెగబడ్డారు. టా స్క్‌ఫోర్స్ సీఐలు శంకర్, రఘునాథ్‌రెడ్డి, ఎస్సై లు హనుమంత్, అనుదీప్, వహీద్ సహా పలువురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో టాస్క్‌ఫోర్స్ అధికారులు నారాయణఖేడ్ పోలీసులకు స మాచారం అందించడంతో నారాయణఖేడ్, సిర్గాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరు కుని పరిస్థితిని అదుపు చేశారు. నిందితులు సహా అధికారులపై దాడికి పాల్పడిన వారు అక్కడి నుంచి పరారయ్యారు.
18 మందిపై ఫిర్యాదు
తమ విధులను అడ్డుకుని తమపై కొందరు దాడికి పాల్పడినట్టు టాస్క్‌ఫోర్స్ అధికారులు నారాయణఖేడ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకుడు, మా జీ ఎంపీపీ చాందీబాయి తనయుడు రమేశ్ చౌహాన్, బన్సీలాల్, రాణాప్రతాప్‌తో పాటు మరో 15 మంది ఈ దాడి ఘటనలో బా ధ్యులుగా పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శ్రీశైలం తెలిపారు.