CMSTE | హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): విద్యావంతులైన గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ముఖ్యమంత్రి గిరిజన ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ (సీఎంఎస్టీఈఐ) పథకం భవితవ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకానికి గత ఆర్థిక సంవత్సరంలో కేసీఆర్ సర్కార్ రూ.50 కోట్లు కేటాయిస్తే, రేవంత్రెడ్డి సర్కార్ ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.12.5 కోట్లు మాత్రమే కేటాయించడమే ఇలాంటి అనుమానాలకు కారణం. ఈ కేటాయింపులు కూడా గత లబ్ధిదారులకు చెల్లించాల్సిన సబ్సిడీయేనని సమాచారం.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉదాత్త ఆశయాలతో ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా గిరిజన ఉన్నత విద్యావంతులైన యువకులకు ఇండియన్ సూల్ ఆఫ్ బిజినెస్ (ఐబీఎం) ద్వారా శిక్షణ ఇప్పించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దారు. గిరిజన సంక్షేమశాఖ ద్వారా శిక్షణ ఇప్పించి రూ.కోటి వరకు ఆర్థిక తోడ్పాటుకు సర్కారే పూచీకత్తు ఇచ్చింది. యూనిట్ కాస్ట్లో 35% సబ్సిడీని గిరిజన యువతకు అందించింది. ప్రస్తుతం గిరిజన సంక్షేమశాఖకు మంత్రి లేక సీఎంఎస్టీఈఐ సహా అనేక పథకాలపై సర్కారుకు వివరాలు చేరడంలేదని గిరిజన యువత భావిస్తున్నది.
గిరిజన సంక్షేమశాఖ ద్వారా కేసీఆర్ అమలు చేసిన సీఎంఎస్టీఈఐ పథకంలో ఇప్పటివరకు లబ్ధి పొందిన గిరిజన తెగల వాటా ఈ విధంగా ఉన్నది.