హైదరాబాద్ : రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో ఎంపిక చేసిన సంస్థల్లో GRE, GMAT, TOEFL, IELTS కోచింగ్ నిమిత్తం అర్హులైన రాష్ట్ర ఎస్టీ విద్యార్థుల నుండి గిరిజన సంక్షేమశాఖ ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఏడాదికి రూ. 2 లక్షల కన్నా తక్కువగా ఉండాలని శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. దరఖాస్తు చివరి గడువు జూన్ 15వ తేదీ. ఆన్లైన్ నమోదుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు https://telanganaepass.cgg.gov.in/ వెబ్సైట్ను సందర్శించవచ్చు. లేదా సంబంధిత జిల్లా గిరిజనాభివృద్ధి అధికారిని సంప్రదించాల్సిందిగా సూచించింది.