జ్వరంతో గిరిజన ఆశ్రమ విద్యార్థిని మృతి
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల జైనూర్ మండలం పానపటార్ ఆశ్రమ పాఠశాలలో బాలుడి మృతి ఘటన మరువక ముందే సిర్పూర్(యూ) మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరో విద్యార్థిని మృతిచెందిన ఘటన జిల్లా వాసులను కలచివేస్తున్నది. విద్యార్థిని కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
- పాఠశాల సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆదివాసీ, బీఆర్ఎస్ నాయకుల ఆందోళన
సిర్పూర్(యూ) ఏప్రిల్ 22 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల జైనూర్ మండలం పానపటార్ ఆశ్రమ పాఠశాలలో బాలుడి మృతి ఘటన మరువక ముందే సిర్పూర్(యూ) మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరో విద్యార్థిని మృతిచెందిన ఘటన జిల్లా వాసులను కలచివేస్తున్నది. విద్యార్థిని కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సిర్పూర్(యూ) మండలం బాబ్జిపేటకు చెంది న ఆదివాసీలు కోట్నాక సుంగు, జంగుబాయి దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు గంగాబాయి(14) మహాగాంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నది. మంగళవారం అర్ధరాత్రి తీవ్రంగా జ్వరం రావడంతో గంగాబాయి స్పృహ కోల్పోయింది. బుధవారం ఉదయం గమనించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రంభాబాయి, సిబ్బంది, ఏఎన్ఎం అంబులెన్స్లో జైనూర్ దవాఖానకు తరలించారు.
వైద్యులు పరీక్షించి అప్పటికే విద్యార్థిని మృతి చెందిందని తెలిపారు. ఉదయం తన కూతురు ఆరోగ్యం బాగాలేదని పాఠశాల నుంచి ఫోన్ వచ్చిందని, ఇ ప్పుడు దవాఖానలో శవాన్ని చూపిస్తున్నారని తండ్రి సుంగు గుండెలు బాదుకుంటూ రోదించడం చూసి అక్కడున్నవారు కన్నీటి పర్యంతమయ్యారు. విద్యార్థిని మృతికి పాఠశాల సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆదివాసీ సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కార్యదర్శి కనకయాదవరావు, బీఆర్ఎస్ నాయకులు దవాఖాన ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడంతో పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డీటీడీవో రమాదేవి, ఐటీడీఏ ఏజెన్సీ డీఈవో గోడం చందర్, అధికారులు వచ్చి విద్యార్థిని తండ్రి సుంగుకు మండలంలోని పంగిడి ఆశ్రమ పాఠశాలలో అవుట్సోర్సింగ్ ఉద్యోగ నియామకపత్రం అందించి, కొంత ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

