హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హరిత ప్రేమికుడని కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ప్రశంసించారు. హరితహారం కార్యక్రమం ద్వారా తన పదేండ్లపాలనలో రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చినట్టు గుర్తుచేశారు. కేసీఆర్ పుట్టినరోజు ఫిబ్రవరి 17ను పురస్కరించుకొని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు సంతోష్‌కుమార్ పిలుపు మేరకు వృక్షార్చనలో భాగంగా పంజాగుట్టలోని జలగం వెంగళరావు పారులో 40 మంది కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు పెద్దఎత్తున మొకలు నాటారు. ముఖ్య అతిథిగా హాజరైన సంతోష్‌కుమార్ మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భగా కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు మాట్లాడుతూ.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్టు పేర్కొన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని విమర్శించారు. కేసీఆరే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని స్పష్టంచేశారు. ఆయన నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నట్టు తెలిపారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా మొకలు నాటాలని, రక్త దానాలు చేయాలని, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపాలని కోరారు. ఈ సందర్భంగా మొకలు నాటి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినవారికి ఎంపీ సంతోష్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు మేడె రాజీవ్‌సాగర్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, దేవీప్రసాద్, ముజీవుద్దీన్, గూడూర్ ప్రవీణ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, వాసు, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, జూలూరు గౌరీశంకర్, మెట్టు శ్రీనివాస్, సుమిత్రాఆనంద్, రజినీసాయిచంద్, మంత్రి శ్రీదేవి, మన్నె కవితారెడ్డి, చిరుమళ్ల రాకేశ్, ఆంజనేయులుగౌడ్, గజ్జెల నగేశ్, వాసుదేవరెడ్డి, వై సతీశ్‌రెడ్డి, పాటిమీది జగన్, ఇంతియాజ్, వల్యానాయక్, దామోదర్‌గుప్తా, కిశోర్‌గౌడ్, ఉపేంద్ర, పల్లె రవికుమార్‌గౌడ్, అక్బర్, నాగేందర్‌గౌడ్, మఠం భిక్షపతి, వెంకటేశ్వర్‌రెడ్డి, సర్వోత్తమ్, మన్నె గోవర్ధన్‌రెడ్డి, తుంగ బాలు, గోసుల శ్రీనివాస్, మెట్టు శ్రీనివాస్, శ్రీధర్, రాఘవేంద్రయాదవ్, పూర్ణచందర్, సతీశ్, ఎన్ఎన్ రాజు, అమృత్హాన్ తదితరులు పాల్గొన్నారు.