గర్భం దాల్చకుండానే చికిత్స!

- హుజూరాబాద్‌లో డాక్టర్ నిర్వాకం
- 5 నెలల తర్వాత వెలుగులోకి..
- నివ్వెరపోయిన మహిళ బంధువులు
హుజూరాబాద్‌టౌన్, జనవరి 18: గర్భం దాల్చని మహిళకు ఓ వైద్యురాలు 5 నెలలపాటు చికిత్స చేసింది. అనుమానం వచ్చిన బాధితురాలి భర్త వేరే దవాఖానలో చూపించగా గర్భం ఉత్తదేనని తేలింది. నివ్వెరపోయిన దంపతులు, వారి బంధువులు ఆందోళన చెందారు. వైద్యురాలి నిర్వాకంపై సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. ఇల్లందకుంట మండలంలోని బూజునూరుకు చెందిన ప్రియాంక పిల్లల కోసం హుజూరాబాద్ ప్రభుత్వ ప్రాంతీయ దవాఖాన గైనకాలజిస్టు నాగ నందితను సంప్రదించారు. దాదాపు 8 నెలలుగా చికిత్స కోసం ఇక్కడికే వస్తున్నారు. ఈ క్రమంలో వైద్యురాలు నాగనందిత జమ్మికుంటలోని తనకు సంబంధించిన ప్రైవేటు దవాఖానకు రావాలని సూచించారు. దీంతో అకడికి వెళ్లిన ప్రియాంకకు సానింగ్ ఇతర పరీక్షలు నిర్వహించి కడుపులో బిడ్డ పరిస్థితి బాగానే ఉన్నదని, ఉమ్మనీరు తకువగా ఉండటంతో మందులు వాడాలని సూచించారు. డెలివరీ డేట్ కూడా చెప్పారు. ఈ క్రమంలో ప్రియాంక భర్తకు అనుమానం వచ్చి వరంగల్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో సీనియర్ గైనకాలజిస్టును సంప్రదించారు. పరీక్షలు చేసిన సదరు వైద్యురాలు.. ప్రియాంకకు గర్భం రాలేదని నిర్ధారించారు. దీంతో ప్రియాంక దంపతులు, బంధువులు మంగళవారం హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానకు వచ్చి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. డాక్టర్ నాగ నందిత తప్పు చేయలేదని, గతంలో ప్రైవేటు వైద్యురాలు ఇచ్చిన రిపోర్టు ప్రకారం పరీక్షలు నిర్వహించి ఆ విధంగా సూచించారని రాజేందర్‌రెడ్డి చెప్పారు. అయితే, ప్రభుత్వ దవాఖానలో పరీక్షలు చేయించుకొనే ప్రియాంకను ప్రైవేటు దవాఖానకు రమ్మని చెప్పిన విషయంలో చర్యలకు సిఫారసు చేయనున్నట్టు వివరణ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

