హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ) : ధాన్యం తరలింపునకు వాహనాలను సమీకరించాలని జిల్లా రవాణా అధికారులకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గురువారం ఆదేశాలు జారీచేశారు.
కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు సరిపడా గూడ్స్ వాహనాలు అందుబాటులో ఉంచాలన్నారు. కలెక్టర్లు, సివిల్ సైప్లె శాఖతో సమన్వయం చేయాలని ఆదేశించారు.