Machana Raghunandan, Transparency, Grain collection centres,Telangana
హైదరాబాద్ : ధాన్యం సేకరణ ఓ యజ్ఞం వంటిదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసిల్దార్ మాచన రఘునందన్(Machana Raghunandan) అభిప్రాయ పడ్డారు. రైతు దినోత్సవం సందర్భంగా రఘునందన్ ఆమనగల్లు పరిసర ప్రాంతాల్లో ధాన్యం సేకరణ కేంద్రాలను(Grain collection centres) తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. నీళ్లు, నీడ వంటి కనీస వసతులు కల్పించాలని చెప్పారు.
జాతీయ రహదారి వద్ద పలువురు రైతులను కలిసి ధాన్యం సేకరణ తీరు పై వాకబు చేశారు. ధాన్యం సేకరణ కేంద్రాల్లో రైతుల వద్ద నుంచి వడ్ల సేకరణ పూర్తి పారదర్శకంగా ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా జరపాలని సూచించారు. వడ్లను తూకం వేయడంలో కూడా రైతు అనుమానాలను నివృత్తి చేయాలని సూచించారు. తేమ పేరిట వడ్లలో తరుగు తీస్తే ఉపేక్షించేది లేదని హెచ్చించారు.
ఆయా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతుల వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. కనీస మద్దతు ధర పై అవగాహన కల్పించారు. రైతులు ఎన్ని ఎకరాల్లో వరి పండించారు, ధాన్యం సేకరణ కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ధాన్యం సేకరణ కేంద్రాల్లో ట్యాబ్లను పనితీరు పై కూడా రైతులకు అవగాహన కల్పించారు.