Transgenders | హైదరాబాద్ : హైదరాబాద్ – శ్రీశైలం ప్రధాన రహదారిపై హిజ్రాలు అరాచకం సృష్టిస్తున్నారు. సాయంత్రం 6 అయిందంటే చాలు.. హైవేకు ఇరువైపులా వాలిపోతున్నారు. అర్ధనగ్నంగా తయారై.. అటుగా వెళ్లే వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా నిల్చుని వాహనాలను ఆపి వసూళ్లకు పాల్పడుతున్నారు. దీంతో కుటుంబాలతో వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రతి రోజు సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఇదే తంతు కొనసాగుతోందని వాహనదారులు పేర్కొన్నారు. హిజ్రాల ఆగడాలు, అరాచకాలు భరించలేని వాహనదారులు పహడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శ్రీశైలం ప్రధాన రహదారి వద్దకు చేరుకుని మంగళవారం రాత్రి పలువురు హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. హైవేలపై అర్ధనగ్నంగా నిల్చుని వాహనదారులకు ఇబ్బందులు కలగజేస్తే కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.