నాగర్ కర్నూల్ : ట్రాన్స్ జెండర్ల హక్కుల చట్టాన్ని ( Transgenders Protest ) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ట్రాన్స్ జెండర్స్ భారీ ధర్నా నిర్వహించారు. ఈ చట్టం తమకు అనుకూలంగా లేదని వాపోయారు. ఈ సందర్భంగా కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాజంలో తమకు సమాన హక్కులు కల్పించాలని కోరారు. వివక్ష లేకుండా గౌరవప్రదమైన జీవనం కావాలని, ట్రాన్స్ జెండర్ల కోసం చట్టాల్లో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు.