హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ట్రాన్స్జెండర్లు తమ ఆధార్ కార్డులో సవరణలు చేసుకోవచ్చని, ఇందుకోసం ఈ నెల 26న హైదరాబాద్‌లో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయనున్నామని దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ సంచాలకులు తెలిపారు. మలక్‌పేటలోని సంచాలకుల కార్యాలయంలో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగుతుందని వెల్లడించారు. వివరాలకు 040-24559048 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.