వచ్చేదే అరకొర కరెంటు! అందులోనూ లోవోల్టేజీ! పంటలు కాపాడుకోవడంలో తలమునకలైన రైతులకు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం తలనొప్పిగా మారింది. మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని మోతీనగర్ ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ వద్ద నిత్యం ఇదే దృశ్యం కనిపిస్తున్నది.
మంగళవారం జూలపల్లి, మల్లాపూర్, వెంకటాపురం, మాచనపల్లి తండా, ఇబ్రహీంబాద్ నుంచి రిపేరు కోసం వచ్చిన ట్రాన్స్ఫార్మర్లు.