Officers Transfers | తెలంగాణలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పలువురు అధికారులను ప్రభుత్వం బుధవారం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎనిమిది జిల్లాలకు చెందిన రిజిస్ట్రార్లను స్థానచలనం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఖమ్మం జిల్లా రిజిస్ట్రార్ సీహెచ్ అశోక్‌కుమార్ ఆదిలాబాద్‌కు బదిలీ అయ్యారు. వరంగల్ రిజిస్ట్రార్ హెచ్ రవి హైదరాబాద్ ఆడిట్‌కు, ఆదిలాబాద్ జిల్లా రిజిస్ట్రార్ ఫణిందర్ వరంగల్ ఆడిట్‌కు బదిలీ అయ్యారు. పటాన్చెరు రిజిస్ట్రార్ ఎం రవీందర్రావు హైదరాబాద్ సౌత్‌కు, హైదరాబాద్ రిజిస్ట్రార్ వల్లి సుబ్బలక్ష్మి పటాన్చెరు రిజిస్ట్రార్‌గా బదిలీపై వెళ్లారు. రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ స్థితప్రజ్ఞ మేడ్చల్ మల్కాజ్‌గిరికి, మేడ్చల్ మల్కాజ్గిరి రిజిస్ట్రార్ ఎం సంతోష్ రంగారెడ్డికి, మేడ్చల్ మల్కాజ్గిరి ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్ ఖమ్మం రిజిస్ట్రార్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.