హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): అసోసియేషన్ ఎన్నికలు జరపాలని, విద్యుత్తు సంస్థల్లో బదిలీలు, ప్రమోషన్లు కల్పించడంతోపాటు ఈఏల నియామకం చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీజీపీఈఏ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. టీజీపీఈఏ జనరల్ బాడీ సమావేశం ఆదివారం హైదరాబాద్‌లోని టీజీ జెన్కో ఆడిటోరియంలో నిర్వహించారు. రామగుండం ప్లాంట్ 62.5 మెగావాట్ల స్థానంలో 8 మెగావాట్ల కొత్త ప్లాంట్‌ను టీజీ జెన్కో ఆధ్వర్యంలోనే నిర్వహించాలని నిర్ణయించారు.
సమావేశంలో టీజీపీఈఏ అధ్యక్షుడు రత్నాకర్‌రావు, అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకటనారాయణరెడ్డి, సెక్రటరీ జనరల్ సదానందం, అడిషనల్ సెక్రటరీ జనరల్ అంజయ్య, చీఫ్ అడ్వైజర్ శివశంకర్, అడ్వైజర్ మంగీలాల్, ఏఐపీఈఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనాథ్‌రెడ్డి, టీజీఎస్పీడీసీఎల్ సెక్రటరీ జనరల్ జనప్రియ, సెక్రటరీ సామ్యనాయక్ తదితరులు పాల్గొన్నారు.