హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): ఈ వేసవి సెలవుల్లోనే టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు శుక్రవారం జాక్టో నేతలు.. విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
కేసు విచారణలో ఉన్నందున తాత్కాలిక పద్ధతిలో పదోన్నతులు కల్పించాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో జాక్టో చైర్మన్ జీ సదానంద్‌గౌడ్, సెక్రటరీ జనరల్ మట్టపల్లి రాధాకృష్ణ, మోహన్‌రెడ్డి, చైతన్యకుమార్, రాములు, పీ చంద్రశేఖర్, పర్వతరెడ్డి, నగేశ్ ఉన్నారు.