సంగారెడ్డి : వట్పల్లి ఎస్ఐ లక్ష్మణ్ (Vatpalli SI Laxman)పై బదిలీ(Transfer) వేటుపడింది. పార్టీలకతీతంగా చట్టాన్ని సంరక్షించాల్సిన పోలీసులు కాంగ్రెస్ నాయకుడి బర్త్‌డే వేడుకల కోసం పోలీస్ స్టేషన్‌ని వేదికగా మార్చారు. నిన్న పోలీస్ స్టేషన్లోనే మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ జ్యోషి బర్త్ డే వేడుకలు(Birthday) నిర్వహించిన ఎస్ఐ, సిబ్బందిపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఈ మేరకు హైదారాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ ఎస్ఐని వీఆర్‌కు పంపారు. మిగతా సిబ్బంది పాత్ర పై విచారణకు ఆదేశించారు.
కాగా,వట్పల్లి ఎస్ఐ పీఎస్‌లో ఎస్ఐ సమక్షంలోనే కాంగ్రెస్ మండల అధ్యక్షుడి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి కేక్‌కట్ చేసి అక్కడే పంచి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ వట్పల్లి మండల అధ్యక్షుడు ప్రతాప్ రమేశ్జోషి పుట్టిన రోజు సందర్భంగా అదివారం వట్పల్లి ఎస్ఐ లక్ష్మణ్, కానిస్టేబుళ్లు అందరూ కలిసి కేక్‌కట్ చేసి జన్మదిన శుభకాంక్షలు తెలియాజేశారు.
కాంగ్రెస్ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు పోలీస్ స్టేషన్లో జరగడం..అది కూడా ఎస్ఐ దగ్గరుండి వేడుకలు నిర్వహించడం పలు విమర్శలకు తావిచ్చింది. పార్టీలకతీతంగా ప్రజలకు సమన్యాయం చేయాల్సిన పోలీసులే ఇలా బహిరంగంగా ఓ పార్టీ నాయకుడి జన్మదిన వేడుకలు నిర్వహించడంపై విమర్శులు వెలువెత్తాయి.