హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీచేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో ఆరుగురు పోస్టింగ్ కోసం ఎదురుచూస్తుండగా, మరో ఇద్దరిని ఇతర శాఖలకు బదిలీ చేశారు. ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న అధర్‌సిన్హాను పశు సంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీచేశారు. ఈపీటీఆర్ఐ డీజీగా ఏ వాణీప్రసాద్‌ను నియమించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్‌గా అనితారాజేంద్రను బదిలీచేశారు.