హైదరాబాద్ : తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్ అధికారులు(IPS Tranfers ) బదిలీ అయ్యారు. ఏసీబీ డీజీగా పనిచేస్తున్న సీవీ ఆనంద్(CV Anand) ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, అవినీతి నిరోధకశాఖ డీజీగా విజయ్‌కుమార్, పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా మహేశ్ భగవత్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. పోలీస్ స్పోర్ట్స్ ఐజీగా ఎం. రమేశ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.