హైదరాబాద్, డిసెంబర్ 26: రాష్ట్రంలో 8 మంది అదనపు ఎస్పీలను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీచేశారు. పీ అశోక్ (ఏఎస్పీ, సీఐడీ), ఎస్ మహేందర్ (అడిషనల్ డీసీపీ-అడ్మిన్, సిద్దిపేట), ఎమ్ శ్రీనివాసులు (అడిషనల్ డీసీపీ, క్రైం, రాచకొండ), చీకోటి రామేశ్వర్ (ఏఎస్పీ-అడ్మిన్, నాగర్‌కర్నూల్) బీ రాములు నాయక్ (ఏఎస్పీ-అడ్మిన్, గద్వాల), యూ రవీందర్‌రెడ్డి (ఏఎస్పీ, సీఐడీ), కే శ్రీదేవి (అసిస్టెంట్ డైరెక్టర్, టీఎస్పీఏ, హైదరాబాద్), పాల్వాయి శ్రీనివాస్‌రెడ్డి (అడిషనల్ డీసీపీ, ట్రాఫిక్, సైబరాబాద్)కు పోస్టింగ్ ఇచ్చారు.