హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): జూలై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త చట్టాలపై న్యాయవాదులు పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ కోరారు. న్యాయవాదుల కోసం రాష్ట్ర పోలీస్ అకాడమీలో రెండ్రోజులపాటు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ సుజోయ్‌పాల్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పోలీస్ అకాడమీ, బార్ కౌన్సిల్‌ను ప్రశంసించారు.
న్యాయవాదులు సోదరభావంతో మెలగాలని, విధానపరమైన బాధ్యతతో వ్యవహరించాలని జస్టిస్ శ్యాం కోశీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి, రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ ఎం రాజేందర్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఏడీజీ అభిలాష బిస్త్ తదితరులు పాల్గొన్నారు.