హైదరాబాద్, మార్చి11 (నమస్తే తెలంగాణ): బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగాల్లో బీసీ యువతకు నెల రోజులపాటు ఉచిత ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాన్ని హైదరాబాద్ సూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, బీసీ స్టడీ సరిల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. శిక్షణ పూర్తయిన తరువాత ప్రైవేట్ బ్యాంకుల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. డిగ్రీ పూర్తయి 26ఏళ్ల కంటే తకువ వయస్సున్న బీసీ అభ్యర్థులు ఏప్రిల్ 8లోగా www.tgstudycircle.cgg.gov.in ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 12న ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆన్లైన్ స్రీనింగ్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తామని వెల్లడించారు. వివరాలకు 040-29303130 నంబర్లో సంప్రదించాలని సూచించారు.