హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐఏఎస్ల బృందం గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని సందర్శించింది. శిక్షణలో భాగంగా మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శశాంక్ గోయల్, కోర్సు డైరెక్టర్ శ్రీదేవి ఐలూరి ఆదేశాల మేరకు సెక్రటేరియట్లోని వివిధ శాఖలను పరిశీలించి, సీఎస్ శాంతికుమారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐఏఎస్లకు సీఎస్ పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న వినూత్న పథకాలు, వాటి లక్ష్యాలు, ప్రభుత్వ ఉద్దేశం, అభివృద్ధి పర్యవసనాలను వివరించారు. సీఎం కేసీఆర్ దార్శనికతను, ముందుచూపును, ఆలోచనా విధానాలను ట్రైనీ ఐఏఎస్లకు సీఎస్ వివరించారు.