కరకగూడెం, మే 25: ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు కోమాలోకి వెళ్లగా, అన్న మృతి చెందాడు. అయితే రెండు రోజులపాటు వేచిచూసిన చెల్లెలు, తల్లిదండ్రులు ఇంకా కోమాలోనే ఉండటంతో దిక్కుతోచనిలో స్థితి లో అన్నకు అంత్యక్రియలు చేసిన విషాదకర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలో సోమవారం చోటుచేసుకున్నది. వివరాలిలా ఉన్నా యి. కరకగూడెం మండల కేంద్రానికి చెందిన ఆడెపు సతీశ్‌కు భార్య స్వప్న, కొడు కు మనోహర్, కూతురు మాధురి ఉన్నారు. సతీశ్‌కు కొంతకాలం క్రితం జరిగిన ప్రమాదంలో తలకు గాయం కాగా, వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ క్రమంలో దాని పరీక్షలు చేయించుకునేందుకు భార్య స్వప్న, కొడుకు మనోహర్ (19)తో కలిసి ఆటోలో భద్రాచలం బయల్దేరారు.
ఆటో బూర్గంపహాడ్ మండలం కోయగూడెం సమీపంలోకి రాగానే అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సతీశ్, స్వప్న, మనోహర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మనోహర్ చికిత్స పొందుతూ ఆదేరోజు మృతి చెందగా, సతీశ్, స్వప్న కోమాలోకి వెళ్లారు. దీంతో మనోహర్ చెల్లెలు మాధురి రెండు రోజులపాటు అన్న మృతదేహాన్ని ఫ్రీజర్‌లో పెట్టి మనోహర్‌కు అంత్యక్రియలు చేయకుండా ఉంచింది. సతీశ్, స్వప్న ఇద్దరూ సోమవారం కూడా కోమాలోనే ఉండటంతో బంధువులు, గ్రామస్తులతో కలిసి సోమవారం వారి స్వగ్రామంలో మనోహర్‌కు అంత్యక్రియలు పూర్తి చేసింది. ఈ సంఘటన కంటతడి పెట్టించింది.