దహెగాం, మే 17 : మాగబెట్టిన మామిడి పండ్లు తిని ఐదేండ్ల బాలుడు చనిపోగా మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలో హ గ్రామంలో చోటుచేసుకున్నది. అయితే వడదెబ్బతో మరణించినట్టు ప్రచారం జరుగుతున్నది. స్థానికుల కథనం ప్రకారం.. బెజ్జూర్ మండలం కుంటమానుపల్లికి చెందిన పోర్తెట్టి శారద, శ్రీనివాస్ దంపతులు లోహ గ్రామానికి పిల్లలతో కలిసి వచ్చారు. శారద శనివారం కేడా గ్రామస్తులతో కలిసి తునికాకు సేకరణకు వెళ్లింది.
సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో శారద, శ్రీనివాస్ దంపతుల కుమారుడు శ్రీవర్ధన్, కూతురు కీర్తనతోపాటు మరో బాలుడు కీర్తి కుమార్ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థత కు గురయ్యారు. వీ రిని వెంటనే కొంచవెల్లిలోని పీహెచ్‌సీకి తరలించి వై ద్యం అందించారు. కుదుటపడటంతో తిరిగి లోహ గ్రామానికి తీసుకొచ్చారు. అర్ధరాత్రి మళ్లీ ము గ్గురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యా రు. ఇందులో శ్రీవర్ధన్ (5) ఇంటివద్దే మృతి చెందాడు. కీర్తన, కీర్తి కుమార్‌ను మంచిర్యాలలోని దవాఖానలో చేర్పించారు. ఈ ఘటనకు కారణాలు తెలియరాదు. కానీ.. చిన్నారులు ఇంట్లో క్యా ల్షియం కార్బైడ్‌తో మాగబెట్టిన పండ్లు తినడం వల్ల జరిగిందా? వడదెబ్బ వల్ల జరిగిందా? అనేది తెలియరాలేదు.