జీడిమెట్ల, అక్టోబర్ 16 : రసాయనాల ట్యాంక్‌లో పడి ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. జీడిమెట్ల పోలీసులు తెలిపిన వివరాలు.. ఏపీకి చెందిన రాము(32), లక్ష్మణ్(32)కవలలు. జీవనోపాధి కోసం వచ్చి అన్నారంలో ఉంటున్నారు.
4 రోజులుగా ‘సబూరి ఫార్మా’ కంపెనీలో పని చేస్తుండగా బుధవారం రామ్, లక్ష్మణ్‌తోపాటు సురేందర్‌రెడ్డి పరిశ్రమలోని వ్యాక్యూం ట్యాంక్ గోడపై నిలబడి పనిచేస్తున్నారు. టీ తాగేందుకు దిగే క్రమంలో రాము ట్యాంక్‌లో పడిపోయాడు. రామును రక్షించేందుకు లక్ష్మణ్ ప్రయత్నించగా అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వీరిని గమనించిన సురేందర్‌రెడ్డి తోటి కార్మికులతో కలిసి ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా అప్పటికే ఇద్దరు మృతి చెందినట్టు డాక్టర్ నిర్ధారించారు.