నిర్మల్ : నిర్మల్ జిల్లా కడెం మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident)లో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. బక్రీద్(Bakrid) పండుగ రోజున దుర్ఘటన జరగడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొన్నది.
కడెం మండల కేంద్రానికి చెందిన సయ్యద్ సమియోద్దీన్(18), మహ్మద్ జిహాన్ (18) అనే ఇద్దరు బైక్ (Bike)పై వెళ్తుండగా పెద్ద బెల్లాల్ శివారులోని చెరువు వద్ద మూల మలుపున చెట్టుకు ఢీ కొన్నారు. దీంతో సయ్యద్ సమియోద్దీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ మహ్మద్ జిహాన్ ను ఖానాపూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు(Police) కేసు నమోదు చేసుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.