భువనగిరి కలెక్టరేట్, సెప్టెంబర్ 12 : అన్న మరణాన్ని తట్ట్టుకోలేక తోడబుట్టిన చెల్లెలు మృతిచెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో శనివారం చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయగిరికి చెందిన కొత్త మల్లయ్య (75) అనారోగ్యంతో శుక్రవారం మృతిచెందాడు. విషయం తెలుసుకున్న యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లికి చెందిన అతడి సోదరి చుక్కల వెంకమ్మ (70) రాయగిరికి చేరుకుని రోదించింది.
అంత్యక్రియల్లో పాల్గొని ఒక్కసారిగా కుప్పకూలింది. గమనించిన కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తోడపుట్టిన అన్న మరణాన్ని జీర్ణించుకోలేని తోబుట్టువు తుది శ్వాస విడవడంతో రాయగిరి, దాతరుపల్లి గ్రామాల్లో విషాధ ఛాయలు అలుముకున్నాయి.