హైదరాబాద్,జనవరి 16 (నమస్తేతెలంగాణ) ః ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన ఐదుగురిలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. సింగరాయకొండ పాకల బీచ్లో గురువారం ఐదుగురు సముద్రస్నానానికి వెళ్లారు.
సముద్రంలో అలల తాకిడికి ఐదుగురూ గల్లంతయ్యారు. గల్లంతైన ఇద్దరిలో ఒకరిని జాలర్లు కాపాడగా.. మరో ముగ్గురు మృతి చెందారు. మరొకరి కోసం మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు. మృతులు పొన్నలూరు మండలం తిమ్మపాలెంకు చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.