గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో ముగ్గురి మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన బీజాపూర్ జిల్లాల్లో సోమవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.
- హోలీ నాడు ఛత్తీస్‌గఢ్‌లో విషాదం
కొత్తగూడెం, మార్చి 25: ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన బీజాపూర్ జిల్లాల్లో సోమవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. హోలీ పర్వదినమైన సోమవారం నాడు సాయంత్రం బాసగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాసగూడ, పున్బాక గ్రామాల మధ్య ఈ ఘటన చోటుచేసుకున్నది. హత్యకు దారి తీసిన కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు. మృతులను చంద్రయ్య మోడియామి, అశోక్ భండారీ, కారం రమేశ్గా గుర్తించినట్టు తెలిపారు.
మావోయిస్టుల మెరుపుదాడిలో జవాన్‌కు గాయాలు
బీజాపూర్ జిల్లా కేంద్రంలోని గోర్నా మంకేలి అటవీ ప్రాంతానికి సమీపంలో మావోయిస్టుల మెరుపుదాడిలో ఓ జవాన్‌కు గాయాలయ్యాయి. అటల్ అవాస్లోకి అకస్మాత్తుగా చొరబడిన మావోయిస్టు యాక్షన్ టీమ్ అక్కడి జవాన్లపై దాడికి దిగింది. అలర్టయిన జవాన్లు ఎదురు కాల్పులకు దిగటంతో మావోయిస్టులు పరారయ్యారు. అయితే అప్పటికే మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో రిజర్వ్ గార్డ్ విభాగానికి చెందిన దీపక్ దుర్గం అనే జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం సుక్మా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు ఆవలం పోడియా మృతి చెందాడు. దానికి ప్రతీకారంగానే ఈ ఆకస్మిక దాడి జరిగినట్టు భావిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

