హైదరాబాద్: మొహర్రం పండుగ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు (Traffic restrictions) విధించారు. మొహర్రం (Muharram) ఊరేగింపు సందర్భంగా పాతబస్తీలోని సర్దార్మహల్, చార్మినార్, గులార్హౌస్, పురానాహవేలీ, ఇమ్లిబన్ బస్టాండ్, చాదర్ఘాట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. శనివారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ప్రాంతాల్లో వాహనాల నిలిపివేత, దారిమళ్లింపు వంటివి ఉంటాయన్నారు.
ఈ నేపథ్యంలో వాహనదారులు ఆయా సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించాఉ. కాగా, మొహర్రం ఊరేగింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఊరేగింపు మార్గాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు.