ఔటర్‌పై ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం
హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్)పై అత్యాధునిక నిఘా నేత్రాలు నీడలా వెంటాడుతున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన హైవే ట్రాఫిక్ మేనేజ్మెంట్ (హెచ్‌టీఎంఎస్) వ్యవస్థ ఔటర్‌పై వాహనాల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నది.
- నీడలా వెంటాడే నిఘా నేత్రాలు
- అడుగడుగునా పర్యవేక్షణ
- ప్రమాదాల నివారణే లక్ష్యం
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్)పై అత్యాధునిక నిఘా నేత్రాలు నీడలా వెంటాడుతున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన హైవే ట్రాఫిక్ మేనేజ్మెంట్ (హెచ్‌టీఎంఎస్) వ్యవస్థ ఔటర్‌పై వాహనాల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నది. అంతర్జాతీయ ప్రమాణాలతో 158 కి.మీ. పొడవున నిర్మించిన ఓఆర్ఆర్పై ట్రాఫిక్‌ను ప్రత్యేక నిపుణులు నానక్‌రాంగూడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి గమనిస్తున్నారు. వాహనాల వేగాన్ని నియంత్రించి, రోడ్డు ప్రమాదాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా హెచ్టీఎంఎస్ను అందుబాలోకి తెచ్చినట్టు పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ తెలిపారు. కీలక ప్రాంతాల్లో స్పీడ్గన్లు, సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని, హెచ్‌టీఎంఎస్ 24/7 పనిచేసేలా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చర్యలు చేపట్టిందని వివరించారు. దీని ద్వారా ఓఆర్ఆర్లో ఎవరు ఎక్కడ ప్రయాణిస్తున్నారు? ఎంత సేపట్లో గమ్యస్థానానికి చేరుకొంటారు? ఎక్కడైనా వర్షం పడుతున్నదా? ట్రాఫిక్ జాం ఏర్పడితే ప్రత్యామ్నాయ మార్గం ఏమిటి? జాతీయ, రాష్ట్ర రహదారులు ఎంత దూరంలో ఉన్నాయి? అనే సమాచారం ముందస్తుగానే తెలుస్తుందని, వేరియబుల్ మెసేజ్ సైన్‌బోర్డు ద్వారా ఈ సమాచారం ప్రయాణికులకు అందుతుందని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

