మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా జడ్చర్ల-భూత్పూర్ జాతీయ రహదారిపై (National Highway) భారీగా వాహనాలు (Traffic Jam) నిలిచిపోయాయి. గురువారం తెల్లవారుజామున నేషనల్ హైవేపై ఓ భారీ వాహనం నిలిచిపోయింది. దీంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, నేషనల్ హవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు. అనంతరం ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. సమారు నాలుగు గంటల పాటు ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయిందని వాహనదారులు వెల్లడించారు.