యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గూడూరు టోల్‌ప్లాజా వద్ద వాహనాలు నిలిచిపోయాయి. టోల్‌ప్లాజాకు ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు క్యూలు కట్టాయి. టోల్‌ప్లాజా నుంచి నెమ్మదిగా వాహనాలు చాలా నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. ఈ ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.