హైదరాబాద్ : హైదరాబాద్ – విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తూప్రాన్‌పేట నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు వాహనాలు స్తంభించిపోయాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విజయవాడ జాతీయ రహదారి పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో జాతీయ రహదారిపై ఎన్‌హెచ్ సిబ్బంది మరమ్మతులు చేస్తోంది. మరమ్మతు పనుల వల్ల వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ క్రమంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఏర్పడింది. ట్రాఫిక్‌జామ్ కారణంగా ఆలస్యం అవుతుండటంతో.. అటు ప్రయాణికులు, ఇటు వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.