HPS Student Akarshana | అమీర్‌పేట్, ఆగస్టు 12: స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే సంప్రదాయ ‘ఎట్ హోమ్’ రిసెప్షన్ ఆహ్వానాన్ని అందుకున్నారు నగరానికి చెందిన ఆకర్షణ సతీశ్. బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 8వ గ్రేడ్ చదువుతున్న ఆమె తాను స్వయంగా సేకరించిన 9,836 పుస్తకాలతో ఇప్పటివరకు తెలంగాణ, తమిళనాడు రాష్ర్టాల్లో 15 గ్రంథాలయాలను నెలకొల్పడం విశేషం.
ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా తాను నిర్వహించే ‘మన్ కీ బాత్’లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రపతి భవన్లో జరిగే సంప్రదాయ ‘ఎట్ హోమ్’ రిసెప్షన్‌కు దేశవ్యాప్తంగా ప్రత్యేకత కలిగి ఉన్న 23మందికి ఆహ్వానాలు అందగా, వారిలో నగరానికి చెందిన ఏకైక బాలిక ఆకర్షణ కావడం గమనార్హం.