చిల్పూరు, మార్చి 22 : ప్రభుత్వ అనుమతితోనే మట్టిని తరలిస్తున్నారా..? అని ప్రశ్నించిన తహసీల్ ఆఫీసు సిబ్బందిపై ట్రాక్టర్ డ్రైవర్లు దౌర్జన్యం చేయడంతోపాటు తహసీల్ ఆఫీసుకు తాళం వేసిన ఘటన జనగామ జిల్లా చిల్పూరులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చిల్పూరులోని తహసీల్ ఆఫీసు ముందు నుంచి శనివారం కొన్ని ట్రాక్టర్లలో మట్టిని తరలిసుండగా గమనించిన ఆర్ఐ చీకటి వినీత్‌కుమార్, తహసీల్ ఆఫీసు సిబ్బంది డ్రైవర్లను ప్రశ్నించారు.
ఆగ్రహించిన ట్రాక్టర్ డ్రైవర్ తోట శ్రీనివాస్, మరికొందరు తహసీల్ ఆఫీసుకు తాళం వేసి అధికారులమీద దౌర్జన్యం చేశారు. తహసీల్ ఆఫీసు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. వినీత్‌కుమార్ మట్లాడుతూ తహసీల్ ఆఫీసు సిబ్బందిపై దౌర్జన్యం చేసి కార్యాలయానికి తాళం వేసిన ఉదంతంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఉన్నారని తెలిపారు.