కొమురవెల్లి, సెప్టెంబర్ 29: బాలికపై ఓ ట్రాక్టర్ డ్రైవర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు, బాలిక తల్లిదండ్రులు నిందితుడి ఇంటికి నిప్పుపెట్టా రు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన ఆదివారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురువన్నపేట లో చోటుచేసుకుంది. గురువన్నపేట ప్రభు త్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న బాలిక(9) శుక్రవారం ఇంట్లో తన చెల్లెళ్లతో ఆడుకుంటున్నది. అదే సమయంలో పక్క ఇంట్లో ఉండే ట్రాక్టర్ డ్రైవర్ ఎండీ షర్ఫుద్దీన్ (20) ఇంట్లోకి ప్రవేశించి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం ఎవరికీ చెప్పొద్దని బాలికను బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. శనివా రం బాలిక అలసటగా ఉండటంతో రాత్రి కుటుంబ సభ్యులు ఏమైందని అడగగా సైకిల్‌పై నుంచి పడినట్టు చెప్పింది. వెంటనే విషయాన్ని బాలిక చెల్లెళ్లు తల్లిదండ్రులకు తెలుపడంతో వారు 100కు ఫోన్ చేశారు. చేర్యాల సీఐ శ్రీను, కొమురవెల్లి ఎస్సై రాజు నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఆదివారం ఉద యం విషయం తెలుసుకున్న గ్రామస్థులు నిందితుడి ఇంటి వద్దకు చేరుకున్నారు. నిందితుడి ఇంటికి నిప్పు అంటించి వాహనాలను ధ్వంసం చేశారు. వెంటనే పోలీసులు మంటలను అదుపులోకి తెచ్చారు. గ్రామంలో భారీ గా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, 144 సెక్షన్ విధించారు. జిల్లా డీసీపీ(అడ్మిన్) మల్లారెడ్డి గ్రామాన్ని సందర్శించారు. విష యం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి వెంటనే సీపీ అనురాధకు ఫోన్‌చేసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాల ని కోరారు. బాలిక తల్లితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బీజేపీ నాయకులు భారీగా తరలివచ్చి గ్రామంలో ఆందోళన నిర్వహించారు.