విద్యార్థులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్
ఇద్దరి దుర్మరణం.. మరొకరికి తీవ్ర గాయాలు
కొల్చారం, జూన్ 28: విద్యార్థులపైకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో ఇద్దరు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా రంగంపేటలో మంగళవారం చోటుచేసుకొన్నది. కొల్చారం ఎస్సై శ్రీనివాస్‌గౌడ్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మెదక్‌కు చెందిన శివాయిపల్లి రాజు, పోచమ్మల కుమారుడు జశ్వంత్ (15), తూర్పాట్ల శంకర్, లక్ష్మి దంపతుల కుమారుడు రజనీకాంత్ (13) రంగంపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతూ స్థానికంగా ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటున్నారు. జశ్వంత్ తొమ్మిదో తరగతి, రజనీకాంత్ ఎనిమిదో తరగతి చదువుతున్నారు. వీరు మంగళవారం పాఠశాలకు వెళ్లకుండా హాస్టల్లోనే ఉండిపోయారు.
మధ్యాహ్న భోజన సమయంలో పాఠశాలకు వెళ్లిన వీరు సోమవారం ఇదే పాఠశాలలో అడ్మిషన్ తీసుకొన్న మెదక్‌కు చెందిన రామ్‌చరణ్‌ను స్కూల్‌ను నుంచి హాస్టల్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ ఈ ముగ్గురిని ఢీకొట్టింది. ఈ ఘటనలో జశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందగా, దవాఖానకు తరలిస్తుండగా రజనీకాంత్ మరణించాడు. రామ్‌చరణ్ రెండుకాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. హాస్టల్ వార్డెన్, ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే ముగ్గురు విద్యార్థులు ప్రమాదం బారిన పడ్డారని స్థానికులు గంటసేపు రోడ్డుపై ఆందోళన చేశారు. మెదక్ రూరల్ సీఐ విజయ్, ఎస్సై శ్రీనివాస్‌గౌడ్, రూరల్ ఎస్సై సంతోష్‌రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి ఆందోళనకారులనచ్చజెప్పి మృతదేహాలను పోస్టుమార్టం కోసం మెదక్ దవాఖానకు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

