హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కామన్ స్కూల్ విద్యావిధానాన్ని అమలుచేయాలని తెలంగాణ ప్రొగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) డిమాండ్ చేసింది. వేసవి సెలవుల్లో టీచర్ల ప్రమోషన్లు, బదిలీల షెడ్యూల్‌ను విడుదల చేయాలని కోరింది. టీచర్ల పెండింగ్ బిల్లులు, డీఏలను వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్‌ను రద్దుచేయాలని రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్, ప్రధాన కార్యదర్శి తిరుపతి డిమాండ్ చేశారు.
అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన ఇరిగేషన్ డీఈఈ
హైదరాబాద్, ఏప్రిల్18 (నమస్తే తెలంగాణ): ఇటీవల నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో రాష్ట్ర ఇరిగేషన్‌శాఖ జగదేవపూర్ డివిజన్ డీఈఈ (డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) రూప్లానాయక్ సత్తా చాటారు. బంగారు, వెండి పతకాలను సాధించారు. దీంతో రూప్లానాయక్‌ను ఇంజినీర్ ఇన్ చీఫ్ (అడ్మిన్) అనిల్‌కుమార్, ఇరిగేషన్ శాఖ ఉద్యోగుల సంఘం ముఖ్య నాయకులు నూనె శ్రీధర్, కృష్ణ, పుషర్,ప్రకాశ్, బండి శ్రీనివాస్, మనోహర్, మహేంద్రనాథ్ తదితరులు అభినందించి సత్కరించారు.