హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తేతెలంగాణ): పంచాయతీలను 4 గ్రేడ్లుగా విభజించాలని మంత్రి సీతక్కకు తెలంగాణ పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. తన నివాసంలో యూనియన్ క్యాలెండర్, డైరీని గురువారం మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీపీఎస్ఏ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి నేతృత్వంలో మంత్రికి వినతిపత్రం ఇచ్చారు.
క్యాడర్ స్ట్రెంత్‌ను బలోపేతం చేసి ప్రమోషన్లు కల్పించాలని, అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని, మెడికల్ ఇన్వాల్యేషన్ ద్వారా నష్టపోయిన వారికి న్యాయం చేయాలని కోరారు.