చార్మినార్, ఏప్రిల్ 22: ‘నేను సచ్ఛీలుడిని. నాపై ఆరోపణ చేస్తే రాజకీయ మైలేజీ వస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లేనిపోని ఆరోపణలు చేస్తూ తన పరువు తీసుకుంటున్నారు’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయానికి చేరుకుని తనపై చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ప్రమాణం చేశారు.
వ్యక్తిగతంగా ఎవరి వద్ద ఎక్కడా, ఎప్పుడూ డబ్బులు తీసుకోలేదని రేవంత్ స్పష్టంచేశారు. ఒకవేళ ఈటల రాజేందర్ వద్ద ఎలాంటి ఆధారాలున్నా అమ్మవారి దేవాలయం వద్దకు వచ్చి ప్రజల ముందుకు చూపెట్టాలని డిమాండ్ చేశారు. నిరాధార ఆరోపణలు చేస్తే ప్రజలే తగిన బుద్ధిచెప్తారని పేర్కొన్నారు.