హైదరాబాద్, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆస్తుల వివరాలను పంపించాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ జిల్లాల అధ్యక్షులను ఆదేశించారు. బుధవారం గాంధీభవన్ నుంచి వారితో జూమ్ మీటింగ్ నిర్వహించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ప్రజలకు పార్టీశ్రేణులు అండగా నిలవాలని కోరారు.
ఆగస్టు నెలాఖరులోగా మండల కమిటీలు, సెప్టెంబర్15 వరకు గ్రామ కమిటీలను పూర్తిచేసి జాబితాలను పీసీసీకి పంపాలని, ఈ నెల 24 నుంచి రెండో విడత జనహిత పాదయాత్రలో పాల్గొనాలని, రాహూల్‌గాంధీ చేపడుతున్న ఓట్ చోరీ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మహేశ్‌కుమార్‌గౌడ్ సూచించారు.