Jhansi Reddy | తొర్రూరు, జూన్ 16: మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్తగారు, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి రెచ్చిపోయారు. నమస్తే తెలంగాణ, టీన్యూస్ రిపోర్టర్లకు కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. రిపోర్టర్లకు ఆమె స్వయంగా కాల్స్ చేసి.. ” మా పార్టీ మీటింగ్లకు మీరు రావద్దు.. మా పార్టీ కార్యక్రమాలకు మేం పిలిచినప్పుడు మాత్రమే రావాలి. లేకపోతే మా కార్యకర్తలతో కొట్టిస్తాం. పోలీసులతో అరెస్టు చేయిస్తాం” అంటూ హెచ్చరించారు.
ఇటీవల పల్లె బాట కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. వారిని మొహం పట్టుకుని హామీలు ఎప్పుడు అమలు చేస్తారని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు తిరగబడుతున్న దృశ్యాన్ని కవర్ చేస్తున్న నేపథ్యంలో నమస్తే తెలంగాణ, టీ న్యూస్ రిపోర్టలకు కాల్స్ చేసి బెదిరింపులకు దిగారు. దీనిపై మీడియా వర్గాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధుల అధికారిక కార్యక్రమాలను కవర్ చేసేందుకు రిపోర్టర్లకు పూర్తి హక్కు ఉంటుందని.. అలాంటి సమయంలో ప్రెస్ ప్రతినిధులను బెదిరించడమేంటని ప్రశ్నిస్తున్నాయి. జర్నలిస్టుల హక్కులను కాలరాస్తే దాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడిగా భావించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. ఈ ఘటనపై సంబంధిత మీడియా సంస్థలు స్పందించాలని, పాత్రికేయ సంఘాలు కూడా స్పందించి రిపోర్టర్ల హక్కులను కాపాడే చర్యలు తీసుకోవాలని మీడియా వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
మా కార్యక్రమాలకు వస్తే అరెస్టు చేయిస్తానంటూ జర్నలిస్టులను బెదిరిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి
ప్రజలు తమపై తిరగబడే వీడియోలు చిత్రీకరిస్తున్నారని, ఇంకోసారి తమ కార్యక్రమాలకు వస్తే కేసు పెట్టీ అరెస్టు చేయిస్తానని జర్నలిస్టును బెదిరించిన యశస్విని… pic.twitter.com/ZfMrUNv7Bj
— Telugu Scribe (@TeluguScribe) June 16, 2025
ఝాన్సీరెడ్డి ఆడియో :